Maa Voori Chitti Guvvalu - Lyrics

Singer: Sahithi Chaganti

మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషామాయేలే, చిందేసి ఆడేలే
అమ్మకు రెండు కన్నులే
నాన్నంటే పిచ్చి ప్రేమలే
దోబూచులాటాలెన్నో ఆడేనే మాగాణి నవ్వేలే...
రత్నాలు లాంటి పిల్లలే
వందేళ్ల పున్నమాయేలే
కన్నులో ఆనందాలు పండెనే మీ గోరు ముద్దకే...
ఏ జన్మల పుణ్యమే... ఈ చక్కని బంధము
మాకంటూ ఉన్న ఆస్తులు, బంగారు బొమ్మలే..
మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషామాయేలే, చిందేసి ఆడేలే....
ఈ ఇంటి మహారాణులు
కోనేటి నీటి జింకలు
వేస్తారు కుళ్ళు జోకులు
తీస్తారు ప్రాఖ్యతలు...
అక్కంటే చెల్లికెంత ప్రేమలే
సంతోషామాయేలే, చిందేసి ఆడేలే