Chinnari Ponnari - Lyrics

Singer: Sureka Murthy, Mallik MVK

జో.... ఆయీ.... యీ.... యీ...యీ... యీ....

జో.... ఆయీ.... యీ.... యీ...యీ... యీ....

చిన్నారి... పొన్నారి... సిలకవే... నువ్వూ...
ఇంగా... కన్నవారి సంకనా... సందమామ నువ్వూ...

జో.... ఆయీ....యీ.... యీ...
యీ... యీ....

నీకు నీళ్లు బోసి... నీలవంగి తొడిగి... ఇంగ...
నిమ్మపండువందురు నిన్ను...
ఊరు వాడళ్ళూ...

నీకు పాలు వోసి... పట్టు లంగా తొడిగి...
పసిడి బొమ్మవందురు నిన్నూ... లేగ దూడళ్ళు....

తన్నన్నారే... తన్నన్నన్నారే....
తానే నానే... తారెరో....
తన్నన్నారే... తన్నన్నన్నారే....
తానే నానే... తారెరో....

1) చరణం ::

ఊడళ్ల మఱ్ఱి కి ఉయ్యాల గట్టితి...
ఉడుత పిల్లల్లార ఊపన్నబోరే...
చెట్టు చెట్టు తిరిగి పాలపిట్టల్లార...
మోదుగు డొప్పల్లా రేగుపండ్లు దేరే...
ఆహా...పజొన్న సేలల్ల ఊరబిస్కెళ్లారా
పావురంగ లేత కంకులు గోస్కరారే...

బంతి సేమంతులతో బండ్లు సేసుకొచ్చి రామ సిలకల్లారా
ఆడింతురారే....
రంగు రంగుల ముద్దు సీతాకోకల్లారా సుక్కలేరుకొచ్చి పక్కలెయ్యరే.....

అట్లట్ల బొయ్యేటి మబ్బు తెప్పళ్ళూ...
ఇంగా...
అట్లట్ల బొయ్యేటి మబ్బు
తెప్పళ్ళూ...
మా బుజ్జికి తెండ్రే పూల తొట్టెళ్ళూ...

జో.... ఆయీ....యీ.... యీ...
యీ... యీ....

పిట్ట రావే... పిట్టా... పిల్లల్లా...
తల్లో...
గావురాల... మా... బుజ్జిని....
జోకొట్టి... ఎల్లో...

తన్నన్నారే... తన్నన్నన్నారే....
తానే నానే... తారెరో....
తన్నన్నారే... తన్నన్నన్నారే....
తానే నానే... తారెరో...

2) చరణం ::

నల్లర్యాగడి దున్ని అలసి మీ అయ్యా...
సెలక గట్టు మీద కూసున్నాడయ్యా...
సద్ది బువ్వ బెట్టి వచ్చేదాకా జర భద్రంగా సెల్లెని సూడు మా అయ్యా...

అయ్యో...
ఎండకు వానకు ఓర్సుకోదు సెల్లె
కడుపుల బెట్టుకొని కాపాడు బిడ్డా...

గండు సీమెలు సెల్లె జామపండనుకొని
కొరికి ఎల్లగాలే కసిరియ్యి బిడ్డా...
తేనెటీగలొచ్చి తంగేడుపువ్వని
కుట్టగాలే నన్ను కూతెయ్యి బిడ్డా...

ఏ పాడు కండ్లు బడనియ్యకుండా...
ఏ పాడు కండ్లు బడనియ్యకుండా...

జర పదిలంగ జూసుకో...
జాగ్రత్త బిడ్డా...
జర్ర పదిలంగా జూసుకో...
జాగ్రత్త బిడ్డా....