Pallerturilone Sadhyam - Lyrics

Singer: Kailash Kher

నేల తల్లికి తొలిసూరు బిడ్డ పల్లెటూరు
ఇళ్ళన్ని చుక్కలుగా వేసిన పెద్ద ముగ్గే పల్లెటూరు
మట్టిని ముద్దాడే పాదాలు2
ప్రవహించే చోటే పల్లెటూరు.....

పల్లవి
లే లే లే లే లెమ్మంటూ సూర్యుణ్ణి నిద్దర లేపటం
లేచి కూత పెట్టమంటూ కోడి పుంజుని తొందర పెట్టడం
పేడ నీళ్లతో అలుకు చల్లడం
నల్లబొగ్గుతో పళ్ళు తోమడం
గిలక బావిలో నీళ్లు తోడటం
మట్టి కుండలో వంట వండటం
ప్రకృతి మాత ఒడిలో ....ఓ..ఓ..ఓ..ఓ
ప్రకృతి మాత ఒడిలో నిత్యం పసిపాపలుగా బ్రతకడం
పల్లెటూరిలోనే సాధ్యం-ఇది పల్లెటూరిలోనే సాధ్యం 6

చరణం1
పంచాయితీలో ఒక్కడి మాటకి
అందరు కట్టుబడి ఉండటం
పక్కింటి కూరలు ఈ ఇంటి అన్నంతో
అనుబంధాన్నే కలపటం..
ఎవరో తెలియని అతిధుల కోసం
ఇంటికి అరుగులు కట్టడం
చీమలు తినడం కోసం బియ్యపిండితో
ముగ్గులు వెయ్యడం

తురక దూదేకుల పీరిలను-ఎల్లయ్యే
యెత్తుకోని తిరగటం
శ్రీరామ నవమి వడపప్పుని చాంద్ పాషా
అందరికి పంచటం
ప్రకృతి మాత గుడిలో ..ఓ.ఓ..ఓ.ఓ..ఓ
ప్రకృతి మాత గుడిలో నిత్యం-భక్తులుగా బ్రతికెయ్యటం
పల్లెటూరిలొనే సాధ్యం-ఇది పల్లెటూరిలోనే సాధ్యం 6

చరణం2
గోచీకట్టిన కాసేపోసిన ఆస్లీలత ఆనింపించదు
పనిపాటల్లో తిట్లు దొర్లిన అసభ్యంగా వినిపించదు
చెంబు చేట బయటే వున్నా-దొంగలు రారని నమ్మకం
విత్తులు నాగలి సిద్ధం చేసి-వానోస్తుందని విశ్వాసం

పురుగు పుట్రతో కలిసుంటూ
చావొస్తే రానుయ్యను ధైర్యం 2
ప్రకృతి మాత బడిలో....ఓ..ఓ..ఓ..ఓ
విద్యార్థులు గా బ్రతకటం..
పల్లెటూరిలోనే సాధ్యం-ఇది పల్లెటూరిలోనే సాధ్యం