Kalakanti Kanula Neeru - Lyrics

Singer: Mohana Bhogaraju

కలకంఠి కనులనీరు
Kalakanthi Kanula Neeru
కానరాని నెలవు లేదు
Kaanarani Nelavu Ledu
కీచకుల నరకమీనాటిదా
Keechakula Narakameenatida

స్వాతంత్ర్య యుగములోన
Swatantrya Yugamulona
ఈ వేట ఆగలేదు
Aa Veta Aagaledu
సైరంద్రి వెతలు ఎన్నాళ్ళనీ
Syrandri Vethalu Ennallani

తలరాతగా తలచే
Talarathaga Thaliche
బలిపీఠమా బతుకు
Bali Peethama Batuku
ఇది స్త్రీల గౌరవించె దేశమా
Idi Streela Gouravinche Desama

నదినీ భువినీ మన తల్లి తీరుగ తలచే
Nadini Bhuvini Mana Talli Teeruga Thalache
పశువే అయినా ఒక గోవుమాతగ కొలిచే
Pasuve Ayina Oka Govumathaga Koliche
పుడమీ ఇదనీ మరచింది మానవ మృగమూ
Pudami Idani Marichindi Manava Mrigama
మృగమే నయమా అనిపించె దానవ జగమూ
Mrugame Nayama Anipinche Danava Jagama

మగువంటే కామపు బొమ్మ
Maguvante Kamapu Bomma
అనుకుంటే బతుకదు అమ్మ
Anukunte Batukadu Amma
రాఘవుడు నడిచిన ఇలలో
Raghavudu Nadichina Ilalo
నిర్భయ ప్రతిక్షణం
Nirbhya Prathikshanam

కలికీ నెమలీ కన్నీటి ధారలతోని
Kaliki Nemali Kanneti Dharalathoni
కలిగేదెపుడో ఈ వేటగాళ్ళకు జాలి
Kaligedepudi Ee Vatagallaki Jali
భయమే బతుకై ఎందాక జీవనయాత్ర
Bayame Brathukai Endaka Jeevanayatra
తనువే ధనువై వేయాలి వేటుకు వేటు
Tanuvai Dhanuvai Veyali Vetuku Vetu

ఎదురించే ఖడ్గము నీవై
Edurinche Khadgamu Neevai
కదలాలి కాళిక దేవై
Kadalali Kalika Devai
నవ దుర్గలు నడిచిన భువిలో
Nava Durgalu Nadichina Bhuvilo
దుర్గవి నీవె కద
Durgavi Neeve Kada